Header Banner

విశాఖ కేంద్రంగా ప్రభుత్వం అనూహ్య నిర్ణయం..! ముహూర్తం ఫిక్స్..!

  Thu May 22, 2025 11:17        Politics

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతోంది. ఈ సమయంలోనే అమరావతి పనులు ప్రారంభం కావటంతో.. ఇతర ప్రాంతాల పైన ప్రభుత్వం ఫోకస్ చేసింది. అందులో భాగంగా కర్నూలుకు హైకోర్టు తరలింపు పైన కసరత్తు జరుగుతోంది. ఇక, విశాఖకు ప్రముఖ సంస్థలను తీసుకొచ్చేందుకు ప్రక్రియ వేగవంతం అయింది. తాజాగా విశాఖ కేం ద్రంగా మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును ప్రారంభించేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది.

విశాఖలో మెట్రో ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ఇందు కోసం ముహూర్తం ఫిక్స్ అయింది. విశాఖ మెట్రోకు సంబంధించి పనులు అక్టోబర్ నెలలో మొదలుపెట్టనున్నట్లు మంత్రి నారాయణ తెలి పారు. భోగాపురం విమానాశ్రయం నిర్మాణ పనులు 2026 ఏప్రిల్‌ నాటికి పూర్తవుతాయని స్పష్టం చేశారు. భోగాపురానికి అనుసంధానిస్తూ ప్రతిపాదించిన 22 రోడ్లలో 15 ఇప్పటికే పూర్తవుతున్నా యన్నారు. 115 రోజుల్లో మిగిలిన వాటికి సంబంధించిన ప్రణాళికను అధికారులు సిద్ధం చేస్తున్నా రన్నారు. జాతీయ రహదారి సంస్థతో సమన్వయం చేసుకుని నూతన రోడ్లు నిర్మిస్తామన్నారు. అదే విధంగా టిడ్కో ఇళ్లు పూర్తి చేయాలంటే రూ. 7 వేల కోట్లు కావాలని వివరించారు.

2014- 2019 మధ్య 7 లక్షల టిడ్కో ఇళ్లు ప్రతిపాదించగా గత ప్రభుత్వం వల్ల అవి ఆగిపోయా యని ఆరోపించారు. కేవలం 2 లక్షల ఇళ్లు కూడా పూర్తి చెయ్యలేక పోయారన్నారు. ఎంత ఖర్చు అయినా లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించడానికి సీఎం చంద్రబాబు సంకల్పించార ని చెప్పారు. ఈ ఏట విజయదశమికి అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతీ ఇంటికి నీరిచ్చేలా 2021 లో అమృత్ పథకం కోసం కేంద్రం నిధులిస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోవడంతో ఆ నిధులు వెనక్కి వెళ్లిపోయాయని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు కేంద్రంతో మాట్లాడటం వల్ల మళ్లీ అమృత్ నిధులు వచ్చాయన్నారు. దీనికోసం రూ.834 కోట్లు నిర్దేశించారన్నారు. కొద్దినెలల్లో అమృత్ పథకం ద్వారా సర్ఫేస్ వాటర్ వస్తుందని స్పష్టం చేశారు. డబుల్ డెక్కర్ మెట్రో కింద డీపీఅర్ ఇచ్చారని చెప్పారు.


ఇది కూడా చదవండి: ఏపీలో కొత్త నేషనల్ హైవే నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లో భూసేకరణ! ఇక 8 గంటల్లో విశాఖ!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!


హైదరాబాద్‌లో మయన్మార్ వాసుల కలకలం..! నకిలీ పత్రాలతో ఆధార్, పాన్!


ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!


ఏపీ ప్రజలకు మరో సూపర్ న్యూస్..! ఏడాదికి రూ.2.5 లక్షలు బెనిఫిట్ ఉచితంగానే!


టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!


అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ పై మంత్రివర్గ కీలక నిర్ణయాలు! ఇక నుండి ఇలా...!


పాఠశాలల్లో రోజూ ఒక గంట యోగా తప్పనిసరి! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!


విమానానికి త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం! 160 మంది ప్రయాణికులతో..


అన్నదాత సుఖీభవ' నిధులు జమ అప్పుడే..! తాజా నిర్ణయంతో..!


ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #VizagDecision #AndhraPradesh #SurpriseMove #APPolitics #VizagUpdate #CMAnnouncement